![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ ఇప్పటికే వెయ్యి ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఎనిమిది వందల ఎపిసోడ్ ల వరకు రాజ్, కావ్య, అపర్ణ, సుభాష్, కవి, అప్పు, స్వప్న, రాహుల్, రుద్రాణి, సీతారామయ్య, ఇందిరాదేవీ, కృష్ణమూర్తి కనకం, ధాన్యలక్ష్మి, ప్రకాష్, అనామిక పాత్రలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి న్యాయం చేశారు. అందుకే ఈ బ్రహ్మముడి సూపర్ హిట్ సీరియల్ గా నిలిచింది. ఇక వెయ్యి ఎపిసోడ్ ల తర్వాత పాత పాత్రలకి ఎండ్ కార్డ్ వేసి కొత్త పాత్రలని పరిచయం చేశారు మేకర్స్.
నందు, ఇందు, రాజు, రేఖ, స్వాతి, మదన్, భ్రమరాంబ, శేషు, ఐశ్వర్య, లక్కీ, ఆంటోనీ లక్ష్మీ, చలపతి అంటూ వీళ్ళు చేసే పర్ఫామెన్స్ ప్రస్తుతం కథని నెక్స్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా రాజు, కావ్య పెళ్ళి చేసుకున్నట్టుగా ఆడుతున్న నాటకం వర్కవుట్ అవుతుంది. రేఖ చేసే కుట్రలకి రాజు సరైన సమాధానాలు చెప్తూ వణుకు పుట్టిస్తున్నాడు.
ఇందు అమాయకత్వాన్ని అలుసుగా చేసుకొని రేఖ చేసే పెత్తనాన్ని అపర్ణ ఎంత ఎదిరించిన ఇన్నాళ్ళు నడవలేదు. అయితే ఇప్పుడు రాజు సపోర్ట్ తో ఇందు అనూహ్య మార్పులు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ సీఈఓగా ఇందు బాధ్యతలు తీసుకుంది. అయితే ఇప్పటికీ తనకు చదువురానట్టుగానే నటించడం కాస్త ఇబ్బందిగా ఉంది. మరి తనకి చదువు వచ్చు అనే నిజాన్ని ఇందు బయటపెడుతుందా.. రాజు సపోర్ట్ తో రేఖకి చెక్ పెడుతుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ లు చూడాల్సిందే.
![]() |
![]() |